ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ ఎస్సీ, ఎస్టీలకు ద్రోహం చేస్తున్నారు: నక్కా ఆనంద్‌బాబు - ముఖ్యమంత్రి జగన్ పై నక్కా కామెంట్స్

Nakka Anand Babu: ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన ప్రమోషన్లను తమ సామాజిక వర్గానికి కట్టబెడుతూ ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్‌ నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు. న్యాయంగా ఈఎన్‌సీ హోదా ఎస్టీ వర్గానికి చెందిన బాలు నాయక్‌కు దక్కాల్సి ఉన్నా... జగన్ తమ సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

Nakka Anand Babu
నక్కా ఆనంద్‌బాబు

By

Published : Dec 1, 2022, 3:46 PM IST

Nakka Anand Babu Fires on Jagan: పంచాయతీ రాజ్ ఈఎన్‌సీ నియామకం జగన్ రెడ్డి దళిత ద్రోహమేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యింది మొదలు ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తూ, జగన్ రెడ్ల సేవలో తరిస్తున్నారని విమర్శించారు. పంచాయతీరాజ్ ఈఎన్‌సీగా సుబ్బారెడ్డిని నియమించిన జగన్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని అన్నారు. సీనియారిటీలో ముందున్న బాలునాయక్​ని కాదని, 5వస్థానంలో ఉన్న సీవీ సుబ్బారెడ్డిని ఈఎన్‌సీగా ఎలా నియమిస్తారని నిలదీశారు.

సీవీ సుబ్బారెడ్డి నియామకంపై పంచాయతీరాజ్ శాఖలోని దళితులు ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు. ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై దళిత సంఘాలు పెదవి విప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓట్లకు తప్ప.. పదవులకు పనికిరారన్న దురాభిప్రాయం జగన్‌ది అని విమర్శించారు. బానిసత్వం, భయంతో బతికితే.. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని జగన్ లాంటి పాలకులు హరిస్తారని దళితులు గుర్తించాలన్నారు. దళిత, గిరిజనుల ఐక్యపోరాటం తాడేపల్లి ప్యాలెస్​ను నేలమట్టం చేసే రోజు దగ్గర్లోనే ఉందని నక్కా ఆనంద్‌బాబు హెచ్చరించారు.

ఎస్సీ, ఎస్టీలకు జగన్‌ ద్రోహం చేస్తున్నారు: నక్కా ఆనందబాబు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details