ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా అభ్యర్థి బుజ్జిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి' - cases on tdp leaders in municipal elections

గుంటూరు నగర పాలకసంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి బుజ్జిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీ నేతలు అన్నారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి సీనియర్ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు వినతిపత్రం అందించారు.

tdp leader letter to guntur dgp
tdp leader letter to guntur dgp

By

Published : Mar 13, 2021, 12:38 PM IST

అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి తెదేపా నేతల వినతి పత్రం

గుంటూరు నగర పాలకసంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి బుజ్జిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు అన్నారు. ఈ కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. నగరపాలక సంస్థ ఎన్నికల వేళ.. తమ అభ్యర్థి బుజ్జిపై మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వర్గీయులు దాడి చేశారని ఆరోపించారు.

ఈ విషయంపై బాధితుడి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వైకాపా నేతల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు బాధితుడిపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులు వైకాపా కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details