ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2020, 7:14 PM IST

ETV Bharat / state

'అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయాయి... చర్యలు తీసుకోండి'

వైకాపా నేతలు ఇసుకను, మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వి అక్రమ రవాణా చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర విమర్శించారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారన్నారని మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో భాస్కర్​రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

'అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయాయి చర్యలు తీసుకోండి'
'అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయాయి చర్యలు తీసుకోండి'

వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గుంటూరు డివిజన్​లో బీసీల పై అరాచకాలు పెరిగిపోయాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర విమర్శించారు. వారిపై తప్పుడు కేసులు బనాయించటంతో పాటు మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీసేలా అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో భాస్కర్​రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఇసుకను, మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారని..,ఇదేమని ప్రశ్నించిన వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం పేరు చెప్పి పేదల స్థలాలు, దళితుల స్థలాలను కబ్జా చేస్తున్నారన్నారని విమర్శించారు. గ్రామవాలంటీర్లు వైకాపా నాయకులకు అనుకూలంగా పనిచేస్తూ.. తెదేపా నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నాయుకుల అరాచకాలు, అవినీతిపై విచారణ జరిపి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను కోరారు.

ABOUT THE AUTHOR

...view details