బాధ్యతగా మెలగాల్సిన మంత్రులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని... మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. మంత్రి మోపిదేవి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. మండలి రద్దు అయితే మంత్రి పదవి పోతుందనే ప్రస్టేషన్లో ఆయన ఏదేదో మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారని విమర్శించారు. శ్రీకాళహస్తి మాడ వీధుల్లో 60 ట్రాక్టర్లతో ర్యాలీ చేయించిన బియ్యపు మధుసూధన్ రెడ్డి ఎవరో తెలియదా అని మంత్రి మోపిదేవిని ప్రశ్నించారు. వైకాపా నేతల నిర్వాకాలపై ఎందుకు మాట్లాడరని జవహర్ నిలదీశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఉండబట్టే పాలన దారుణంగా ఉందని జవహర్ ఆక్షేపించారు.
'శ్రీకాళహస్తిలో కరోనాను వ్యాప్తి చేసిన స్లీపర్ సెల్స్ ఎవరు..?' - మంత్రి మోపిదేవి వివాదాస్పద వ్యాఖ్యలు
తెదేపా స్లీపర్ సెల్స్.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చేస్తున్నాయేమోనన్న అనుమానం కలుగుతుందన్న మంత్రి మోపిదేవి వ్యాఖ్యలపై మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. ర్యాలీలు నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమైంది ఎవరో తెలియదా అని ప్రశ్నించారు.
jawahar