ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: జీవీ ఆంజనేయులు - తెదేపా నేత జీవీ ఆంజనేయులు తాజా వార్తలు

నివర్ తుపాను కారణంగా పంటలు నష్టపోయన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని... తెదేపా నేత జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. నకరికల్లు మండలంలో నష్టపోయిన పంటలను పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడారు.

tdp leader gv anjaneyulu visits crop damaged areas in nakirilallu at guntur district
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: జీవీ ఆంజనేయులు

By

Published : Nov 30, 2020, 8:56 PM IST


రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోందని గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. నివర్ తుపాను ప్రభావంతో నకరికల్లు మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. 30 శాతానికి పైగా దెబ్బతిన్న పంటలకు మాత్రమే నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్పడం సరికాదన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details