ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుడు 5 వేలు డిమాండ్ చేసి..ఇప్పుడు 500 ఇస్తారా?: తెదేపా నేత జీవీ - జగన్​పై జీవీ ఆంజనేయులు వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తెదేపా నేత జీవీ ఆంజనేయులు పర్యటించి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ గాలి మోటర్​లో చక్కర్లు కొట్టడం కాకుండా..నేల మీద పంట పొలాల్లో తిరిగి రైతుల బాధలు, కష్టాలు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.

అప్పుడు 5 వేలు డిమాండ్ చేసి..ఇప్పుడు 500 ఇస్తారా?: తెదేపా నేత జీవీ
అప్పుడు 5 వేలు డిమాండ్ చేసి..ఇప్పుడు 500 ఇస్తారా?: తెదేపా నేత జీవీ

By

Published : Dec 1, 2020, 7:17 PM IST

ముఖ్యమంత్రి జగన్ గాలి మోటర్​లో చక్కర్లు కొట్టడం కాకుండా..నేల మీద పంట పొలాల్లో తిరిగి రైతుల బాధలు, కష్టాలు తెలుసుకోవాలని తెదేపా నేత జీవీ ఆంజనేయులు హితవు పలికారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు మైక్రో ఇరిగేషన్, మైక్రో ఇంటెంట్ ఉచితంగా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్...రైతులకు వాటిని ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వహయంలో పంటనష్టపోయిన రైతులకు రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్...ఇప్పుడు రూ. 500 ఇవ్వటం చాలా బాధకరమన్నారు.

ABOUT THE AUTHOR

...view details