స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలతో గెలిచేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్లలో జరిగిన ఘటనలే అందుకు నిదర్శనమన్నారు. పోలీసులు, అధికారుల అండతో విపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ ఆత్మ ఘోషిస్తుందని ఆవేదన చెందారు. ఇలాంటి దుర్మార్గాలు చరిత్రలో తానెప్పుడూ చూడలేదని.. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం, గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
'వైకాపా దౌర్జన్యాలు చేసి గెలవాలని చూస్తోంది' - వైకాపాపై తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆగ్రహం
వైకాపా చేస్తున్న దౌర్జన్యాలను చరిత్రలో ఎప్పుడూ చూడలేదని తెదేపా నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. ప్రతిపక్ష అభ్యర్థులను కనీసం నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
వైకాపాపై జీవీ ఆంజనేయులు ఆగ్రహం