ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వం నేతన్నలను మోసం చేస్తోంది' - తెదేపా నేత గంజి చిరంజీవి తాజా వార్తలు

సీఎం జగన్ నేతన్నలను మోసం చేశారని తెదేపా నేత గంజి చిరంజీవి విమర్శించారు. నేతన్న నేస్తం పథకం కొంత మందికే అమలు చేస్తూ మిగతా వారిని నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ganji chiranjeevi
గంజి చిరంజీవి, తెదేపా అధికార ప్రతినిథి

By

Published : Nov 16, 2020, 12:36 PM IST

వైకాపా ప్రభుత్వం చేనేత కార్మికులను నయవంచనకు గురి చేసిందని తెదేపా అధికార ప్రతినిధి గంజి చిరంజీవి మండిపడ్డారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులంటే కేవలం 81వేల మందికి మాత్రమే నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మగ్గం ఉన్న వారినే చేనేత కార్మికులుగా పరిగణిస్తూ మిగిలినవారందరినీ నట్టేట ముంచారని ధ్వజమెత్తారు.

గతంలో అద్దెకు మగ్గం నడిపే వారికి గుర్తింపు కార్డులుండటంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధి అందేదని.. వైకాపా ప్రభుత్వం చేనేత నేస్తం కొంతమందికే అందచేస్తోందన్నారు. మిగిలిన పథకాల లబ్ధిని అందరికీ నిలిపివేయటంతో చేనేత కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందని ఆవేదన వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details