గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలపై సంగం డెయిరీ ఛైర్మన్, తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఘాటుగా స్పందించారు. పాడి రైతులకు ఇచ్చే బోనస్.. ఇతర ప్రోత్సాహకాల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. పదవితోనూ వ్యాపారం చేయవచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారని చెప్పారు. వినుకొండ బైపాస్ రోడ్డును ఎమ్మెల్యే తన పొలాలకు సమీపంలోకి మళ్లించారని ఆరోపించారు.
'పదవితోనూ వ్యాపారం చేయొచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారు' - sangham dairy chairman dhulipalla narendra news
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సంగం డెయిరీపై చేసిన విమర్శలకు సంస్థ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర సమాధానమిచ్చారు. డెయిరీ నిర్వహించిన బ్రహ్మనాయుడు... సంగం డెయిరీని విమర్శించటం ఆశ్ఛర్యం కలిగించిందన్నారు. పాడి రైతులకు ఇచ్చే బోనస్, ఇతర ప్రోత్సాహకాల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
!['పదవితోనూ వ్యాపారం చేయొచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారు' tdp leader dhulipalla on mla bolla brahmanayudu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12556553-1023-12556553-1627107641399.jpg)
tdp leader dhulipalla on mla bolla brahmanayudu
'పదవితోనూ వ్యాపారం చేయోచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారు'
ఇదీ చదవండి: