ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడ్డంగా తవ్వేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు: ధూళిపాళ్ల నరేంద్ర - వైసీపీ నేతల అక్రమ మైనింగ్

TDP leader Dhulipalla Narendra: గుంటూరు జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలపై తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర మరోసారి ఆందోళన చేప్టటారు. చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం వద్ద ఎలాంటి అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వి తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. అక్కడ అక్రమపై నుల శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అక్రమ మైనింగ్​పై అధికారులు మౌనంగా ఉన్నారని నరేంద్ర ఆరోపించారు.

TDP leader Dhulipalla Narendra
తెలుగుదేశం నేత ధూలిపాళ్ల నరేంద్ర

By

Published : Jan 6, 2023, 6:11 PM IST

Dhulipalla Comments on Illegal Mining: గుంటూరు జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలపై తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర మరోసారి ఆందోళన చేప్టటారు. చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం వద్ద ఎలాంటి అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వి తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. తవ్వకాలకు సంబంధించి అనుమతులు చూపించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ప్రభుత్వంలోని పెద్దలు కలిసి క్వారీ నిర్వహిస్తున్నారని నరేంద్ర ఆరోపించారు. మట్టి తవ్వుకునేది వాళ్లే, తరలించే వాహనాలు వారివే అని ఆరోపించారు. ఒక్కో టిప్పరు 45 నుంచి 50 టన్నుల మట్టితో వెళ్లడంతో రోడ్లు పాడవుతున్నాయని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

అనుమతులకు మించి మట్టి తరలింపు కారణంగా భూగర్భ జలాలు ఇంకిపోవడంతో పాటుగా ఆయా గ్రామాలు శ్మశానంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉదయం నుంచి జిల్లా కలెక్టర్, గనుల శాఖ అధికారులు, రెవెన్యూ, ఆర్​టీఓ అధికారులకు సమాచారం అందించినా ఇంతవరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక లోడ్​తో మట్టి తరలిస్తున్నారని.. ఆర్​టీఓకు సమాచారం ఇస్తే మట్టి తరలిస్తున్న డ్రైవర్లను తమకు అప్పగిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న గ్రామాలను పరిశీలిస్తామని ధూళిపాళ్ల వెల్లడించారు. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోతే స్థానిక కార్యకర్తల సహకారంతో ఆందోళన చేపడతామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్రమ మైనింగ్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నరేంద్ర డిమాండ్ చేశారు. ధూళిపాళ్ల అక్కడినుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు వినకపోవడంతో నరేంద్రకు నోటీసులు అందజేసి పోలీస్​ వాహనంలో చింతలపూడిలోని ఆయన నివాసానికి తరలించారు.

అక్రమ మట్టి తవ్వకాలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం

'స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ప్రభుత్వంలోని పెద్దలు కలిసి క్వారీలను నిర్వహిస్తున్నారు. అనుమతులకు మించి మట్టి తరలింపు కారణంగా భూగర్భ జలాలు ఇంకిపోవడంతో పాటుగా, ఆయా గ్రామాలు శ్మశానంగా మారుతున్నాయి. రోడ్లు పాడవుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో టిప్పర్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాను ఉదయం నుంచి అధికారులకు సమాచారం అందించినా వారు ఇంతవరకు స్పందించలేదు. టిప్పర్లలో అధిక లోడ్​తో మట్టి తరలిస్తున్నారు. ఆర్​టీఓకు సమాచారం ఇస్తే.. మట్టి తరలిస్తున్న డ్రైవర్లను తమకు అప్పగిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు.'- ధూళిపాళ్ల నరేంద్ర, తెలుగుదేశం నేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details