ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకుంఠపురం బ్యారేజీ పనులు ఎందుకు ఆపారు: దేవినేని - tdp leader

వైకుంఠపురం బ్యారేజీ పనులను ఎందుకు నిలిపివేశారని తెదేపా నేత దేవినేని ప్రశ్నించారు. బహుదా-వంశధార అనుసంధానం పనులు నిలిపివేశారని...పట్టిసీమ ద్వారా పంటలకు తెదేపా ప్రభుత్వం నీరందించిందని ఆయన గుర్తుచేశారు.

tdp

By

Published : Jun 29, 2019, 12:02 PM IST

వైకుంఠపురం బ్యారేజీ పనులు ఎందుకు ఆపారు:దేవినేని

తెదేపా పాలనలో పనుల పురోగతిపై నిన్న సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని తెదేపా నేత దేవినేని అన్నారు. ఉత్తరాంధ్ర ఏం అన్యాయం చేసిందని... వైకుంఠపురం బ్యారేజీ పనులను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. ఐదేళ్లపాటు కఠోర శ్రమతో తెదేపా పాలనలో పనుల పురోగతి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో చేయాల్సిన పనుల గురించి ప్రణాళికను తెదేపా ముందే తయారు చేసిందన్నారు. 13జిల్లాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెదేపా తయారు చేసిందని ఆయన గుర్తు చేశారు. తోటపల్లి ప్రాజెక్టు గురించి సమావేశంలో ఎందుకు మాట్లాడలేదన్న దేవినేని ఉమ.. సీఎం జగన్‌ మౌనం సరికాదని.. రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బహుదా-వంశధార అనుసంధానం పనులు నిలిపివేశారని...పట్టిసీమ ద్వారా తాము పంటలకు నీరందించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details