ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ వాళ్ల దాడిలో నష్టపోయిన బాధితురాలికి.. టీడీపీ 5 లక్షల ఆర్థిక సాయం

TDP Leader Chandrababu Helped The Victim: వైఎస్సార్​సీపీ శ్రేణుల దాడిలో నష్టపోయిన తిరుపతి జిల్లా శివనాధపురానికి చెందిన మునిరాజమ్మకు టీడీపీ అధినేత చంద్రబాబు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. యువగళం పాదయాత్రలో తన బాధలను లోకేశ్‌కు చెప్పుకున్నరనే కారణంతో మునిరాజమ్మ హోటల్‌పై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారు.

TDP Leader Chandrababu Helped
టీడీపీ సాయం

By

Published : Mar 4, 2023, 7:58 PM IST

TDP Leader Chandrababu Helped The Victim: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాధపురానికి చెందిన మునిరాజమ్మకు 5 లక్షల రూపాయల సాయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో.. మునిరాజమ్మ తన బాధలను చెప్పుకుంది. దీంతో ఆమె హోటల్​పై శ్రీకాళహస్తిలో వైఎస్సార్సీపీ శ్రేణులు దాడి చేశారని వాపోయారు. మునిరాజమ్మ.. టీడీపీ అధినేత చంద్రబాబును పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి నాటి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను వివరించారు.

తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మునిరాజమ్మకు అధినేత చంద్రబాబు ధైర్యం చెప్పారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. తనను కులం పేరుతో దూషించాడని బాధితురాలు మునిరాజమ్మ ఆరోపించారు. అతని అనుచరులు ఎమ్మెల్యే బూట్లు నాకి, క్షమాపణ అడిగితే వదిలేస్తామని అన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ వాళ్లు తనను అన్నమాటలు, భవిష్యత్​లో ఏ మహిళా పడకూడదన్నారు. రజకులంటే కాళహస్తి ఎమ్మెల్యేకి ఈర్ష్యా, అసూయ అని దుయ్యబట్టారు.

ఇదీ జరిగింది..కొద్దిరోజుల క్రితం ఓ హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హోటల్ యజమాని మునిరాజమ్మ. కొంత మంది వ్యక్తులు.. తమ హోటల్‌కు వచ్చి టిఫిన్ చేశారని.. కానీ తరువాత తనపైనే తప్పుడు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్ర సందర్భంగా.. ప్రభుత్వం పనితీరు.. తమ ఇబ్బందుల గురించి మునిరాజమ్మ బయటపెట్టారు. దీంతో అప్పటి నుంచి ఇలా వివిధ రకాలుగా వేదిస్తున్నారని మునిరాజమ్మ విలపించారు.

దీనిపై మళ్లీ వైఎస్సార్సీపీ నాయకులు వేధింపులు ఆగలేదు. హోటల్‌పై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేయడమే కాకుండా.. తన గురించి, తన కులం గురించి మాట్లాడుతూ.. దూషిస్తున్నారని మునిరాజమ్మ పేర్కొన్నారు. ఊరొదిలి వెళ్లిపోవాలని లేదుంటే క్షమాపణలు చెప్పాలని వేధిస్తున్నారని తెలిపారు. హోటల్ ధ్వంసం చేయడంతో పిల్లల చదువులు కూడా కష్టంగా మారాయని తెలిపారు. పిల్లల చదువుల కోసం అప్పులు కూడా చేసినట్లు.. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నానని మునిరాజమ్మ వాపోయారు.

అదే విధంగా తన ఇంటికి మీటర్ కనెక్షన్ ఇవ్వడం కోసం.. వీఆర్​వో 30 వేల రూపాయలు అడిగారని మునిరాజమ్మ ఆరోపించారు. అందుకు నిరాకరించడంతో వీఆర్​వో తనపై తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్​సీపీ నాయకులు తన భర్తను కూడా వేధిస్తున్నారని, ఫోన్ చేసి నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారని మునిరాజమ్మ ఆందోళన వ్యక్తం చేసింది.

ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తన భర్త ఉద్యోగాన్ని కూడా తీసేశారని.. వాపోయారు. జీవనోపాది కోల్పోవడంతో.. ఇంటి అవసరాలకు తన మంగళ సూత్ర కూడా అమ్మాల్సి వచ్చిందని తెలిపింది. ఇలాంటి పరిస్థితలపై తన బాధను లోకేశ్ కు చెప్పుకోవడమే పాపమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

లోకేశ్ స్పందన.. మునిరాజమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా.. వారి తరపున న్యాయం పోరాటం కూడా చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. దీంతో మునిరాజమ్మకి పార్టీ తరుపున తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయిదు లక్షల రూపాయలను సాయంగా అందించారు.

"మున్నా అనే వ్యక్తి .. నా తమ్ముడి ఫోన్ నుంచి చేసి.. నాపై పరువు నష్టం దావా వేస్తా అన్నారు. వీఆర్​వోపై విషయంలో నువ్వు చేసిన పనికి కేసు వేస్తా అని చెప్పారు. అయ్యగారి కాళ్లు పట్టుకోమని.. నన్ను రకరకాలుగా బెదిరించారు. నా ప్రాణం పోయినా సరే నేను అలా చెయ్యను అని చెప్పాను. ఊరు వదిలి వెళ్లమని చెప్పారు. నేనేం తప్పు చేయలేదు కాబట్టి.. నేను పోను అని చెప్పాను. నా భర్తకు కూడా ఫోన్ చేసి బెదిరించారు". - మునిరాజమ్మ, బాధితురాలు

వైఎస్సార్​సీపీ శ్రేణుల దాడిలో నష్టపోయిన మహిళకు చంద్రబాబు సాయం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details