ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Atchannaidu Sensational Comments on CID: ఆధారాలు చూపలేక సీఐడీ మరోసారి బోల్తా పడింది: అచ్చెన్నాయుడు - చంద్రబాబు ఆన్ వైసీపీ

Atchannaidu Sensational Comments on CID: ఆధారాలు చూపలేక సీఐడీ బోల్తా పడిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టుకు కారణాలు చూపలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2018లో 27 కోట్లు తెదేపాకు అందాయని సీఐడీ కోర్టులో చెప్పిందని... ఆరా తీస్తే అవి పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్‌గా నిర్ధరణ అయిందన్నారు.

Achanna comments
Achanna comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 10:19 PM IST

Atchannaidu Sensational Comments on CID: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు చూపలేక సీఐడీ మరోసారి బోల్తా పడిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టుకు కారణాలు చూపలేక.. వైసీపీ ప్రభుత్వం మరో తప్పుడు ప్రచారంతో అడ్డంగా బుక్కయ్యిందని మండిపడ్డారు. 2018లో రూ.27 కోట్లు టీడీపీకి అందాయంటూ సీఐడీ కోర్టులో చెప్పిందని పేర్కొన్నారు. తీరా ఆరా తీస్తే ఆ మొత్తం పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్​గా నిర్థారణ అయ్యిందని తెలిపారు. చంద్రబాబుపై కేసులో ఆధారాలు చూపలేక సీఐడీ ఆపసోపాలు పడుతుందని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలే అక్రమాలు అని కట్టుకథ అల్లుతున్నారని అచ్చెన్న ధ్వజమెత్తారు.

ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ నుంచి అధికారికంగా డాక్యుమెంట్స్ లభిస్తాయని.. ఆ డాక్యుమెంట్ తీసుకుని, అవే లంచం అంటూ సీఐడీ వాదించిందని మండిపడ్డారు. పెద్ద మొత్తంలో నగదు అని ప్రచారం చేసిదని, చివరికి అధికారికంగా వచ్చే విరాళాలనే స్కాం అంటూ వాదనలు వినిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 వేలు పైన నగదు రూపంలో ఇచే ప్రతి విరాళం ఇన్​కమ్ టాక్స్​కి, ఈసీఐ ఇవ్వాలని నిబంధన ఉందని తెలిపారు. ఆ ప్రకారం అన్ని వివరాలను తెలుగుదేశం వెల్లడించిందని స్పష్టం చేశారు. టీడీపీకి రూ.27 కోట్లు విరాళం వచ్చిందన్న ఏడాది వైసీపీకి బాండ్స్ రూపంలో రూ. 99 కోట్లు విరాళం వచ్చిందని తెలిపారు. వైసీపీకి ఏడాదికి ఎంత విరాళం వచ్చిందో చెపుతూ వివరాలను తెలుగుదేశం విడుదల చేసింది. రాజకీయ పార్టీగా టీడీపీకి వచ్చే విరాళాన్ని లంచం అంటూ సీఐడీ బుకాయిస్తుందని ఎద్దేవా చేశారు. వైకాపాకు వచ్చిన రూ. 330.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ లెక్క ఏమిటని ప్రశ్నించారు. స్కిల్ కేసులో 370 కోట్లు చంద్రబాబు కొట్టేశారని ఇప్పటివరకు చెప్పిన CID.... నేడు నిబంధనల ప్రకారం వచ్చిన బాండ్స్ ను చూపించి 27 కోట్లు పార్టీ ఖాతాకు వచ్చాయని వాదనలు వినిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Agitations Continues Against Chandrababu Arrest: వైసీపీ సర్కారుపై ఆగ్రహ జ్వాలలు.. చంద్రబాబుకు మద్దతుగా ముప్పేట ఆందోళనలు

'స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఆధారాలు చూపలేక మరోసారి సీఐడీ బోల్తా పడింది. చంద్రబాబు అరెస్టుకు కారణాలు చూపలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2018లో 27 కోట్లు టీడీపీకి అందాయని CID కోర్టులో చెప్పింది. ఆరా తీస్తే అవి పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్‌గా నిర్ధరణ అయిందన్నారు. ఆధారాలు చూపలేక పార్టీలకు వచ్చే విరాళాలే అక్రమాలు అని కట్టుకథలు చెప్తున్నారు ఈసీ వెబ్‌సైట్ డాక్యుమెంట్ తీసుకుని అదే లంచమని CID వాదించింది. అధికారికంగా వచ్చే విరాళాలనే స్కామ్‌ అంటూ వాదనలు వినిపించింది.'-అచ్చెన్నాయుడుతెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

Chandrababu Naidu judicial remand extended: చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్​ 19 వరకు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details