గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో వ్యక్తిగత వివాదంలో... తెదేపా కార్యకర్తపై కేసు పెట్టడం సమంజసం కాదని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో గొడవపెట్టుకుంటే... మాజీసర్పంచి కోటిరెడ్డిపై పోలీసులు అన్యాయంగా కేసు బనాయిస్తున్నారని ఆరోపించారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి రాగానే గొడవలు సృష్టించి... గ్రామం వదలి వెళ్లేలా చేశారని ఆరోపించారు. కోటిరెడ్డి ప్రస్తుతం గుంటూరు నగరంలో నివసిస్తుంటే... రాజనాల వెంకటరెడ్డిపై దాడి చేశాడని కేసు బనాయించడం దారుణమన్నారు.
'గొడవలతో సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెడుతున్నారు' - చదలవాడ అరవింద్ బాబు
గొడవలతో సంబంధం లేని వ్యక్తులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని... నరసరావుపేట తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి రాగానే గొడవలు సృష్టించి... గ్రామం వదలి వెళ్లేలా చేశారని ధ్వజమెత్తారు.
!['గొడవలతో సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెడుతున్నారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4519399-794-4519399-1569152594953.jpg)
చదలవాడ అరవింద్ బాబు