ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొలిక్కి వచ్చిన అంకులు హత్య కేసు! - tdp leader ankulu murder case updates

గుంటూరు జిల్లాలో హత్య కాబడ్డ తెదేపా నేత, పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హత్య కేసులో.. కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కొల్లిక్కి వచ్చినట్లేనని సమాచారం.

tdp leader ankulu murder case has come to an end
కొలిక్కి వచ్చిన అంకులు హత్య కేసు..!

By

Published : Jan 17, 2021, 1:50 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హత్య కేసు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. హత్య చేసిన కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించడంతో కీలక సమాచారం రాబట్టారు.

హత్యలో ఎవరి ప్రమేయం ఉందో స్పష్టత వచ్చింది. రూ.15 లక్షల రూపాయలకు కిరాయి హత్యకు ఒప్పందం చేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. నగదు ఇచ్చి హత్య చేయించెందెవరు? ఇంకా ఎవరి ప్రమేయం ఉందోనని పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details