గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నకౌలు రైతు సుంకర ప్రసన్నాంజనేయులు కుటుంబాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. ఖాజీపేటలోని రైతు నివాసానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. తుపాను, వరదల కారణంగా పంట నష్టపోవటం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగటంతో ప్రజన్నాంజనేయులు బలవన్మరణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆలపాటికి వివరించారు.
పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి తక్షణ పరిహారం అంది ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆలపాటి అభిప్రాయపడ్డారు. రైతు కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.