మాన్సాస్ ట్రస్ట్ పట్ల ప్రభుత్వ వ్యవహారంపై హైకోర్టు తీర్పుతో అయినా ప్రభుత్వ పెద్దలకు బుద్ధి రావట్లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజా దుయ్యబట్టారు. 'విలువైన ట్రస్టు భూములు, వేల కోట్ల సంపదను కాజేసేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి వెలంపల్లి.. అశోక్ గజపతిరాజుని విమర్శించడం ఆకాశం మీద ఉమ్మటమే. రాష్ట్రమంతా తెలిసిన అశోక్ గజపతి రాజు గొప్ప వ్యక్తిత్వంపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలు హేయం' అని విమర్శించారు.
Mansas Trust Controversy: హైకోర్టు తీర్పుతో అయినా బుద్ధి రావట్లేదు: ఆలపాటి రాజా - మాజీ మంత్రి ఆలపాటి రాజా
మాన్సాస్ ట్రస్టు విషయంలో ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వంలోని పెద్దలకు బుద్ధి రావటం లేదని దుయ్యబట్టారు.
alapati raja