'అర్హత లేని వారికి హెడ్‌వర్క్స్ పనులు కట్టబెట్టారు' - tdp leader alapati raja opposes revese tendering process in polavaram
పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం సరికాదని తెదేపా నేత ఆలపాటి రాజా అన్నారు. హెడ్‌వర్క్స్ పనులు అర్హత లేని గుత్తేదారులకు కట్టబెట్టారని మండిపడ్డారు.
రివర్స్ టెండరింగ్‌పై మాట్లాడుతున్న ఆలపాటి రాజా
పోలవరం ప్రాజెక్టు విషయంలో గత గుత్తేదార్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం సరికాదని తెదేపా నేత ఆలపాటి రాజా అన్నారు. అర్హత లేని గుత్తేదారులకు హెడ్‌వర్క్స్ పనులు కట్టబెడుతున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో పోలవరం పనుల వేగంలో గిన్నిస్ రికార్డు సాధించామని గుర్తు చేశారు. నీటిపారుదలశాఖ మంత్రి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆలపాటి రాజా మండిపడ్డారు.