స్థానిక ఎన్నికల వాయిదాపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీంతీర్పునూ వైకాపా తప్పుదోవ పట్టిస్తుందని... తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... కరోనా నియంత్రణకు ఎన్నికలు వాయిదా వేయటాన్ని సుప్రీం సమర్ధించిందన్నారు. మళ్లీ ఎన్నికలపై నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని సుప్రీం చెప్పిందన్నారు. వైకాపా నేతలు మాత్రం ప్రభుత్వ అనుమతి తర్వాతే ఎన్నికలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ అక్రమాలకు అంతే లేకుండా పోయిందని... అందుకే ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదటి నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
రెచ్చగొట్టేలా వైకాపా తీరు...