TDP Launched Jagan Reddy 85 Percent Fail Book: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం స్వీకారం (30 మే 2019) చేసిన రోజు మొదలుకొని ఈరోజు వరకు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో 85శాతం ఫెయిల్ అయ్యారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. 'జగన్ రెడ్డి హామీల అమలులో 85శాతం ఫెయిల్' అనే పుస్తకాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సీనియర్ నేతలతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
Achchennaidu Comments:టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ''రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి గురువారం 'జగన్ రెడ్డి హామీల అమలులో 85శాతం ఫెయిల్' అనే పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ ఆవిష్కరించింది. 99 శాతం హామీలు అమలు చేశానని జగన్ అబద్ధం చెబుతున్నారు. ప్రజలకు 730 హామీలు ఇచ్చి, అందులో 109 మాత్రమే అమలు చేశారు. 15 శాతం హామీలు అమలు చేసి, 85 శాతం ఎగ్గొట్టారు. 99.5 శాతం హామీలు పూర్తి చేశానని అసత్యాలు చెబుతున్నారు. నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసింది. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా?, ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా? పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం 74శాతం పూర్తి చేసి ఇస్తే, గోదావరిలో ముంచేశారు.'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ సోమరితనం వల్లే గుండ్లకమ్మ గేట్లు ఊడి- నీరు వృథా అవుతుంది: అచ్చెన్నాయుడు
Achchennaidu TDP Manifesto:సీఎం జగన్ గతకొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోను కనబడకుండా చేశామని రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూస్తే, అందులో టీడీపీ మ్యానిఫెస్టో ఉంటుంది చూసుకోండని ఆయన సూచించారు. నాలుగున్నరేళ్లలో 2 లక్షల 40 వేల కోట్లు పేదవాళ్లకు ఖర్చు పెట్టామని చెప్తున్నా జగన్ ప్రభుత్వం, మిగతా డబ్బు ఏం చేశారో చెప్పాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్క పైసా అయినా ఖర్చు పెట్టారా? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో 52 నెలల పాలనలో ఒక్కో కుటుంబంపై సుమారు 8,25,549 రూపాయల అదనపు భారం మోపారనిఅచ్చెన్నాయుడు ఆరోపించారు.
8 జిల్లాల కలెక్టర్లు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారు -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేతల ఫిర్యాదు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలపై రూ.57వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. కరెంటులో కోతలు విధించింది. బినామీలకు 2.2 లక్షల కోట్ల విద్యుత్ కాంట్రాక్టులు ఇచ్చింది. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో రూ.15వేల కోట్ల కమిషన్ తాడేపల్లి ప్యాలెస్ కొట్టేసింది. నాసిరకం మద్యం పోసి 35 లక్షల మందిని రోగాల బారిన పడేసింది. మద్యం, డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమవుతోంది. ఆరోగ్య సురక్ష పేరుతో జగన్ నాటకాలు ఆడుతున్నారు. ఉచిత ఇసుక విధానం రద్దు చేసి, నాలుగు రెట్లు ఇసుక రేట్లు పెంచారు. దీంతో భవన నిర్మాణ రంగాన్ని కుప్పకూలింది. 125 వృత్తులు, వ్యాపారాల్ని దెబ్బతీశారు. 30 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు. అమ్మఒడికి రూ.13వేలు ఇచ్చి, నాన్న బుడ్డిలో రూ.70వేలు కొట్టేస్తున్నారు. డ్రైవర్‌కు 10 వేలు ఇచ్చి పెట్రోల్, ట్యాక్సులు పోలీసు జరిమానాలతో లక్షలు కొట్టేశారు.-తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు
నాలుగున్నరేళ్లలో 4 లక్షల కోట్లు కొల్లగొట్టారు - ప్రజల ధనం దోపిడీ చేసే జగన్ ఈ స్థాయికి వచ్చారు: అచ్చెన్న