ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా 'టీడీపీ - జనసేన' 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

TDP Janasena Mini Manifesto: కౌలు రైతులకూ ఏటా 20 వేల రూపాయల చొప్పున అన్నదాత పథకం పేరిట ఆర్థికసాయం చేయాలని. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది. యువత ఉద్యోగ, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్రాభివృద్ధే తమ ప్రధాన అంశమని ప్రకటించాయి. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టోని ప్రకటించిన రెండు పార్టీలు త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన దిశగా కసరత్తు ముమ్మరం చేశాయి.

TDP_Janasena_Mini_Manifesto
TDP_Janasena_Mini_Manifesto

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 9:03 AM IST

రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా టీడీపీ జనసేన 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

TDP Janasena Mini Manifesto :తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ (TDP Super Six) పథకాలకు అదనంగా జనసేన ప్రతిపాదించిన ఐదు అంశాలను జతచేసి మొత్తం 11 అంశాలతో మినీ మేనిఫెస్టో (TDP-Janasena Mini Manifesto) ప్రకటించారు. జనసేన మొత్తం 6 అంశాలు ప్రతిపాదించగా అందులో రైతులు, యువతకు సంబంధించి పలు ఉమ్మడి అంశాలు సమాంతరంగా ఉన్నందున మొత్తం 11 అంశాలుగా మిని మేనిఫెస్టోను ఖరారు చేశారు.

Telugu Desam JanaSena Alliance Releases 11 Point Mini Manifesto For 2024 Elections :కౌలు రైతులకూ ఏడాదికి 20 వేల ఆర్థిక సాయం అందజేయడంతో పాటు సాగుకు సంబంధించిన ఇతర సూచనల్ని టీడీపీ ఇప్పటికే ప్రకటించిన 'అన్నదాత'లో కలిపేసి ఒకే అంశంగా చేర్చారు. జగన్ నిలుపుదల చేసిన సంక్షేమ పథకాలను (Welfare schemes) పునరుద్ధరించాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది. చంద్రబాబు-పవన్ ఫొటోలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టో రూపకల్పన చేయాలని తీర్మానించింది. సీపీఎస్ అంశంపై ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరపనునుంది.

సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా నేడు టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం

తెలుగుదేశం ప్రతిపాదించిన అంశాలు : టీడీపీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ అంశాల్లో తొలుత మహాశక్తి పేరిట ఆడబిడ్డలకు ప్రత్యేక నిధిని ప్రకటించారు. 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళల ఖాతాల్లో నెలకు 1500 ఇస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ప్రతీ బిడ్డా చదువుకునేందుకు ఇంట్లో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఏటా 15 వేలు ఇస్తామమని ప్రకటించారు. దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహిళలందరికీ జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు.

యువత కోసం యువగళం పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3వేల నిరుద్యోగ భృతిని, 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల హామీని ప్రకటించారు. అన్నదాత పేరిట రైతులకు ప్రకటించిన మేనిఫెస్టోలో ఏటా 20వేలు ఆర్థిక సహాయం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్ను దన్ను గా నిలుస్తున్న బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఇంటికి నిర్దిష్టమైన ప్రణాళికతో కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తారు. పూర్ టు రిచ్ (Poor to Rich) పేరిట ప్రతి పేదవాడిని ధనికుడిని చేసేలా ప్రత్యేక కార్యాచరణను తెలుగుదేశం ప్రకటించింది.

టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన - హరిరామ జోగయ్య కీలక సూచనలు
జనసేన ప్రతిపాదించిన అంశాలు :తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌కు జనసేన ప్రతిపాదించిన 5 అంశాలను జత చేశారు. సౌభాగ్యపథం పేరిట చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర సంస్థల్ని స్థాపించేయువతకు ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం లేదా గరిష్ఠంగా 10 లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తారు. ఉచిత ఇసుక విధానం పునరుద్ధరించి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణరంగాన్ని ఆదుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక రాజధాని అని తేల్చి చెప్పారు.

సంపన్న ఆంధ్రప్రదేశ్‌ పేరటి ప్రజలపై పన్నులు, ఇతర ఆర్థిక భారాల్ని తగ్గించి మౌలిక వసతుల అభివృద్ధి చేసి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని మెరుగు పరుస్తామన్నారు. కార్మికుల సంక్షేమం కింద వలసల్ని నివారించి, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కమిటీ తదుపరి సమావేశం జనసేన కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు.
'అసమానతలు తొలగేలా, ఆర్థిక వ్యవస్థ గాడిన పడేలా' - తెలుగుదేశం, జనసేన మినీ మేనిఫెస్టో

ABOUT THE AUTHOR

...view details