ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ తీరుకు నిరసనగా చదలవాడ నిరాహారదీక్ష - నరసరావుపేట తెదేపా ఇంఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు నిరాహారదీక్ష

కరోనా వ్యాప్తిని నిరోధించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నరసరావుపేట తెదేపా ఇంఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు దీక్షకు దిగారు.

tdp incharge chadhalavada arvinda babu  Hunger Strike in narasaraopeta
ప్రభుత్వ తీరుకు నిరసనగా చదలవాడ నిరహారదీక్ష
author img

By

Published : Apr 15, 2020, 3:22 PM IST

ప్రభుత్వం కరోనాపై అవలంబిస్తున్న తీరుకు నిరసనగా నరసరావుపేట తెదేపా ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు నిరాహార దీక్ష చేపట్టారు. దేశ వ్యాప్తంగా కరోనాపై ప్రభుత్వాలు, ప్రజలు యుద్ధాలు చేస్తుంటే... ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా లేదని చదలవాడ అన్నారు. కరోనాతో రాష్ట్రంలోని ప్రజలు సంపాదన కోల్పోయి తిండికి ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. పేదలకు న్యాయం చేయాలని కోరుతూ.... స్థానిక తెదేపా కార్యాలయంలో చదలవాడ నిరాహారదీక్షకు దిగారు.

అన్నా క్యాంటీన్​లు తెరవాలి..

భారత దేశంలో అన్ని రాష్ట్రాలు కరోనాను నివారించేందుకు గట్టి చర్యలు చేపడుతుంటే... సీఎం మాత్రం ఎన్నికలు జరుపుకోవాలని చూస్తున్నారని చదలవాడ ఎద్దేవా చేశారు. కరోనా ప్రభావంతో పేద కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని... వారి కోసం అన్నా క్యాంటీన్లను తెరవాలని ఆయన కోరారు. అదేవిధంగా కరోనా బారిన పడిన రోగులకు చికిత్స అందిస్తోన్న వైద్యులకు కనీసం మాస్క్​లు అందించలేని స్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందన్నారు. పీపీఈ కిట్లు, మాస్క్​లు కావాలని వైద్యులు, అధికారులు అడిగితే వారిని సస్పెండ్ చేస్తున్నారని... ఇదెక్కడ పరిపాలన అని ప్రశ్నించారు. కరోనా బాధితులకు, నిరుపేదలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

వలస కూలీ.. బతుకు కూలి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details