గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెదేపా వర్గీయుల ఇళ్ల వద్ద మెట్లను కూల్చివేసిన ఘటనపై తెదేపా నేతలు ఆగ్రహం వెల్లబుచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, చదలవాడ అరవిందబాబుతో కూడిన బృందం ఇస్సాపాలెంలో పర్యటించింది. బాధితులతో మాట్లాడిన తెదేపా నేతలు కూల్చివేత కారణాలపై ఆరా తీశారు. అన్ని రకాల అనుమతులు ఉన్నా.. కూల్చివేయడం దారుణమని ఆక్షేపించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తెదేపా వర్గీయుల ఆస్తులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు సైతం స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లు విని.. నిర్మాణాలు కూల్చివేయటం దారుణమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులపైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
'రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తెదేపా వర్గీయుల ఆస్తులపై దాడులు' - guntur district Issapalem news update
తెదేపా ఉన్నతస్థాయి కమిటీ గుంటూరు జిల్లా ఇస్సాపాలెంలో పర్యటించింది. తెదేపా వర్గీయుల ఇళ్ల వద్ద మెట్లను కూల్చివేసిన ఘటనలో బాధితులను కలిసి.. కారణాలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తెదేపా వర్గీయుల ఆస్తులపై దాడులకు పాల్పడుతున్నారని తెదేపా నేతల బృందం ఆరోపించింది.

ఇస్సపాలెంలో తెదేపా ఉన్నతస్థాయి కమిటీ పర్యటన