గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత శ్మశానవాటిక విధ్వంసంపై మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా పిల్లి మాణిక్యాల రావు, మానుకొండ శివ ప్రసాద్, దేవతోటి నాగరాజులను నియమించారు.
దళిత శ్మశానవాటిక ధ్వంసంపై తెదేపా నిజ నిర్ధారణ కమిటీ - tdp fact finding Committee latest news
దళితుల మనోభావాలను అగౌరవ పరిచేలా, అవమాన పరిచేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా నేతలు ఆరోపించారు. చిలకలూరిపేటలో దళిత శ్మశానవాటిక ధ్వంసంపై తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.
tdp flag
దళితుల అనుమతి లేకుండా శ్మశానవాటికలో ఏ విధంగా పనులు మొదలుపెడతారని నేతలు ధ్వజమెత్తారు. దళితుల మనోభావాలను అగౌరవపరిచేలా, అవమానపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గడిచిన 16 నెలల్లో రోజుకో చోట దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. విధ్వంసకర పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చారని విమర్శించారు. దళిత వ్యతిరేక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని తెదేపా నేతలు ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు.
Last Updated : Sep 29, 2020, 1:18 PM IST