TDP Azadi ka Amrit Mahotsav.. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు.. తెలుగుదేశం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15న గుంటూరులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో సభ కోసం భూమిపూజ నిర్వహించారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రావణ్‌కుమార్.. కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. దేశం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తితో.. తెలుగుదేశం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుందని తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జాతీయ జెండాను ఆవిష్కరించి తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని నాయకులు తెలిపారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల నిర్వహణకు తెదేపా ఏర్పాట్లు - tdp organize the arrangements of azadi ka amrit mahotsav
TDP AZADI ARRANGEMENTS ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు గుంటూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
TDP AZADI ARRANGEMENTS