గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపినవారికి బహుమతులు ప్రదానం చేశారు. ఇదే కార్యక్రమంలో... భగవద్గీత తాళపత్ర గ్రంథాన్ని ఆవిష్కరించారు. విద్యారంగం అభివృద్ధికి గత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు. పురపాలక పాఠశాలలు సైతం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడేలా తీర్చిదిద్దామని చెప్పారు. ప్రభుత్వాలు కల్పిస్తోన్న ప్రోత్సాహకాలను విద్యార్థులు వినియోగించుకోవాలని.... వాటి ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు.
'విద్యారంగ అభివృద్ధి తెదేపా ప్రభుత్వం కృషి చేసింది' - maddali giridhar
విద్యారంగ అభివృద్ధికి గత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ స్పష్టం చేశారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించారు.
విద్యారంగ అభివృద్ధి తెదేపా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది