రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది: ప్రత్తిపాటి పుల్లారావు - వైకాపాపై మండిపడ్డ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
రాష్ట్రంలో వైకాపా అరాచకపాలన చేస్తోందని మాజీమంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్ జైలులో ఉన్న స్థానిక తెదేపా నాయకులను ఆయన పరామర్శించారు. తెదేపా నాయకుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆటవికపాలన సాగుతోందని మాజీమంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నరసరావుపేట సబ్‌జైలులో ఉన్న చిలకలూరిపేట మద్దిరాల గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్తలను ఆయన పరామర్శించారు. వైకాపా నేతలకు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అమానుషమన్నారు. చిలకలూరిపేటలో వైకాపాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల అంతర్గత వివాదాల్లో సంబంధం లేని వ్యక్తులను పోలీసులు అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. ఆయా గ్రామాల్లో దాడికి సంబంధం లేని వ్యక్తులపై పోలీసులే అక్రమంగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారన్నారు. విశాఖలో చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులే తిరిగి అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైకాపా అరాచకపాలనపై చంద్రబాబుతో పాటు ప్రజలు కూడా పోరాటం చేయాలని ఆయన కోరారు.