ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలి' - టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాలి తెదేపా నిరసన

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో లబ్ధిదారులకు కేటాయించిన 6,512 టిడ్కో గృహాలను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని... తెదేపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు కమిషనర్ రవీంద్రకు వినతిపత్రం అందజేశారు.

tdp followers protest in chilakaluripeta at guntur to give tidco houses to beneficries
లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలంటూ చిలకలూరిపేటలో తెదేపా నాయకుల నిరసన

By

Published : Nov 7, 2020, 3:59 PM IST

తెదేపా ప్రభుత్వ హయాంలో టిడ్కో ద్వారా 52 ఎకరాల్లో పీఎంఏవై పథకం ద్వారా నిర్మించిన 6,512 గృహాలను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా నేతలు ధర్నా చేపట్టారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తైనా... లబ్ధిదారులకు కేటాయించిన టిడ్కో గృహాలను ఇంతవరకు అప్పగించకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. వెంటనే పేదలకు టిడ్కో ఇళ్లను అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ రవీంద్రకు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details