ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్టీ మారాలని దాడులు చేయడం దారుణం: తెదేపా - updates

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో తమ నాయకులపై దాడులు చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. చిలకలూరిపేట నియోజకవర్గం కనపర్రులో తెదేపా వర్గీయులపై వైకాపా శ్రేణులే దాడి చేశాయని అన్నారు. బాధితులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పరామర్శించారు.

tdp
tdp

By

Published : Aug 27, 2020, 5:13 PM IST

వైకాపా ఎమ్మెల్యే రజని... ముఖ్యమంత్రి వద్ద మంచి పేరు తెచ్చుకోవాలని వైకాపా కార్యకర్తలను రెచ్చగొట్టి తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. ఇలాంటి పాలన చరిత్రలో ఇప్పటివరకు చూడలేదన్నారు.

గత ముఖ్యమంత్రులు ఏపార్టీ వారైనా.. ప్రతిపక్ష నాయకులను పార్టీ మార్పుల కోసం ఒత్తిళ్లతో దాడులు చేసిన ఘటనలు చూడలేదన్నారు. అలాంటి దాడులు ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే భారీ ఎత్తున తెదేపా ఆందోళనలకు దిగుతుందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details