ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను.. నా కుమారుడికి టికెట్​ అడుగుతా"

RAYAPATI SAMBASIVA RAO : వచ్చే ఎన్నికల్లో అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను పోటీ చేయడం లేదని మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో జరిగిన నారా లోకేశ్‌ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

RAYAPATI SAMBASIVA RAO
RAYAPATI SAMBASIVA RAO

By

Published : Jan 24, 2023, 9:45 AM IST

RAYAPATI SAMBASIVA RAO : నరసరావుపేట ఎంపీ సీటును కడప వాళ్లకిస్తే ఓడిస్తామని, తమ వర్గం సహకరించదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. తాడికొండ నియోజకవర్గ టీడీపీ నేత తోకల రాజవర్ధన్‌రావు ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో నిర్వహించారు. తొలుత మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌ ఇంటి నుంచి బండ్లమూడి గార్డెన్స్‌లో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ 40 కిలోల కేకు కోశారు.

ఈ సందర్భంగా రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ... ‘వచ్చే ఎన్నికల్లో అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను పోటీ చేయడం లేదు. మా కుటుంబం నుంచి (మా అబ్బాయి, అమ్మాయికి) రెండు అసెంబ్లీ సీట్లు కావాలని గతంలోనే చంద్రబాబును అడిగాం. తాడికొండ సీటును తోకల రాజవర్ధన్‌రావుకు ఇవ్వాలి. ఆయన అక్కడ గెలుస్తారు. నరసరావుపేట ఎంపీ సీటు కడపోళ్లకు ఇస్తే ఓడించి తీరతాం. అవసరమైతే నేనే ఎంపీగా పోటీ చేస్తా. నేను పోటీలోకి దిగితే వీళ్లు ఎవరూ పనికి రారు. నా సీటు వేరే ఎవరికో ఇస్తానంటే చూస్తూ ఊరుకోం’ అని రాయపాటి స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌తో పొత్తు ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details