టిడ్కో ఇళ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని.. రాత్రికి రాత్రే లబ్ధిదారుల పేర్లు మార్పునకు నిరసనగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
రాత్రికి రాత్రే టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పేర్లు మార్చారు: మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
టిడ్కో ఇళ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారంటూ.. పొన్నూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇళ్ల మంజూరు జాబితా నుంచి అసలైన లబ్ధిదారుల పేర్లు తొలగించారంటూ ఆయన మండిపడ్డారు. లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
గత ప్రభుత్వ హయాంలో రూ.175 కోట్ల రూపాయలతో 2365 గృహ నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని.. అప్పటికే 1400 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి చేత కొంత నగదును కేటాయించి ఇళ్లు కట్టించడం జరిగిందన్నారు. లబ్ధిదారుల పేర్లను లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి ఇళ్ల మంజూరు పత్రాలు కూడా అందజేసినట్లు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న కారణాలతో నగదు చెల్లించిన లబ్ధిదారుల పేర్లను తొలగించి రాత్రికి రాత్రే పేర్లు మార్పు చేశారంటు మండిపడ్డారు. అనుమతి పొందిన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి