ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడాది పాలనలో.. వైకాపా లక్ష కోట్ల అవినీతికి పాల్పడింది: ధూళిపాళ్ల - tdp comments on ysrcp latest news

వైకాపా ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏడాదిలో వైకాపా నేతలు లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

tdp dulipala
tdp dulipala

By

Published : Jun 1, 2020, 3:02 PM IST

ఏడాది పాలనలో వైకాపా లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో 55 లక్షల చిన్నారులు ఉంటే.. 35 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల ఖాతాల్లో మాత్రమే అమ్మ ఒడి నగదు జమ చేశారన్నారు.

ఎన్నికల ముందు స్వయం సహాయక బృందాలకు తీసుకున్న రుణం మొత్తం మాఫీ చేస్తామని చెప్పి .. పథకం పేరు పెట్టి గత ప్రభుత్వాల మాదిరిగానే కేవలం వడ్డీలే తిరిగి అందజేశారని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో పార్టీ నేతలు భారీ స్థాయిలో కుంభకోణాలకు తెరతీశారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details