ఏప్రిల్ 28వ తేదీలోపు కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖకు వెళ్లాలని... ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. లాక్‌డౌన్ సమయంలోనూ అమరావతి రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో హైకోర్టు తీర్పునూ బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో... కేవలం కొన్ని మండలాలకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని సూచించడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలపైన ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు.
'కావాలనే ఈ సమయంలో రైతులను వేధిస్తున్నారు' - tdp devineni uma comments on cm jagan updates
కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖకు ఏప్రిల్ 28లోగా వెళ్లాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. హైకోర్టు తీర్పును లెక్కచేయకుండా... అమరావతి రైతులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
!['కావాలనే ఈ సమయంలో రైతులను వేధిస్తున్నారు' tdp-devineni](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6766097-thumbnail-3x2-uma.jpg)
tdp-devineni