కరోనా వ్యాప్తితో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే.. మద్యం దుకాణాలు తెరచి వైరస్ను మరింత విస్తరింపచేస్తున్నారని బాపట్ల తెదేపా ఇంచార్జ్ వేగేశన నరేంద్ర మండిపడ్డారు.
ప్రజల ఆరోగ్యాన్ని నాసిరకం బ్రాండ్లు దారుణంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన చెందారు. లాక్డౌన్ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలని బాపట్ల ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.