ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: తెదేపా - గుంటూరులో తెదేపా నేతల పర్యటన

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని...లేకుంటే రోడ్లపై ఆందోళనలు చేస్తామని తెదేపా నేతలు హెచ్చరించారు. తెదేపా నేతలు గుంటూరు జిల్లాలోని నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

By

Published : Nov 30, 2020, 8:32 PM IST

గుంటూరు జిల్లాలోని నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా నేతలు పర్యటించారు. తెనాలి మండలంలో నీట మునిగిన పంటను ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని...లేకుంటే రోడ్లపై ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details