Dalit Sammelana Sabha at TDP Central Office: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజు చేపట్టిన సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా 'దళితులంతా బాబుతోనే' పేరిట గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత సమ్మేళన సభ నిర్వహించారు. సభలో పాల్గొన్న నాయకులు.. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దళితులంతా బాబుతోనే అంటూ నినదించారు. ఎస్సీలు తిరగబడి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
నా ఎస్సీ, ఎస్టీలు అంటూనే వాళ్లపై జగన్ దాడులు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు Dalit Sabha at TDP Central Office: 'దళితులంతా బాబుతోనే' అనే నినాదంతో టీడీపీ కేంద్ర కార్యాలయం సోమవారం దళిత సమ్మేళన సభ జరిగింది. ఈ సభకు తెలుగుదేశం ముఖ్యనేతలు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ పక్ష విప్ జవహర్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలు, దురాగతాలపై దళిత జాతి తిరగబడాల్సిన సమయం వచ్చిందని నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 20 శాతం పైనున్న దళితులు ఏకతాటిపై నిలిచి, వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని గద్దె దింపి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేస్తేనే మనుగడ సాధ్యమని పేర్కొన్నారు.
విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్, ఆర్టీసీ ఎండీ దిగ్భ్రాంతి- రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
TDP Leaders on YSRCP Bus Yatra: వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయన్న అక్కసుతోనే జగన్ ప్రభుత్వం.. దళితులపై దాడులకు తెగబడుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. దళితులు జగన్‌కు, జగన్ ప్రభుత్వానికి సలహాదారులుగా పనికిరారని, దళితుల్లో మేథావులు లేరని జగన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దళితుల్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Achchennaidu Comments: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..''ముఖ్యమంత్రి జగన్.. నా ఎస్సీలు, ఎస్టీలు అంటూనే వాళ్లపై దాడులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పథకాలన్నీ జగన్ రద్దు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడమే జగన్ పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి వస్తుంటే అనేక మంది స్వాగతం పలికారు. అన్ని వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఉచితంగా ఇచ్చిన ఇసుకలో కూడా అవినీతి జరిగిందని కేసు పెట్టారు. జగన్..ఈ రాష్ట్రానికి తీరని నష్టం చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలంతా సిద్ధమవ్వాలి. దళితులంతా ఏకం కావాలి. వచ్చే ఎన్నికల్లో 29 ఎస్సీ స్థానాల్లో 29 చోట్లా తెలుగుదేశం గెలుస్తుందని స్పష్టం చేసారు. జనసేనతో కలిస్తే పులివెందులలో కూడా గెలుస్తామని పేర్కొన్నారు. మొన్నీమధ్యే పులివెందులలో కార్యాలయం ప్రారంభించామని వెల్లడించారు. జగన్ మీద పులివెందులలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలిపారు. దళితుల ఆత్మగౌరవాన్ని వైకాపా దళిత ప్రజా ప్రతినిధులు జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం దళితులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం నాయకులు ప్రతి మాల పల్లెకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటుపడేలా కృషి చేయాలి'' అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
మాల మాదిగల పంతం వైకాపా అంతం.. నినాదంతో ముందుకు వెళ్లాలని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు కోరారు. చంద్రబాబును ముఖ్య మంత్రిని చెయ్యడమే ఎస్సీల లక్ష్యంగా పని చేయాలన్నారు. దళిత ద్రోహి జగన్ రెడ్డిని దళితులు తరిమి కొట్టాలని తెలిపారు.
ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే దళితులపై దాడులు - బస్సు ప్రమాదంపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి: లోకేశ్
''క్రైస్తువులైనా దళితుల ఓట్ల కోసమే జగన్.. ఆయన తల్లి విజయమ్మ చేతిలో బైబిల్ పెట్టి మోసగించారు. గత ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి దళితులు ఎంత ఉత్సాహంతో పనిచేశారో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో గద్దె దింపేందుకు సిద్ధమవ్వాలి. దళితులకు జగన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అవమానాలు, అన్యాయాలు, దాడులను చూడలేక దళితులంతా ఆవేదన చెందుతున్నారు. కాబట్టి 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపుతాం-చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దాం''- టీడీపీ నేతలు
ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ - ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రతిపాదన