దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం.. వారికే వ్యతిరేకంగా పని చేస్తోందని దళిత సంఘాల నేత మానుకొండ శివప్రసాద్ ఆరోపించారు. దళితుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుంటూరు తెదేపా కార్యాలయంలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఎస్సీ సంక్షేమానికి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎన్ని నిధులు విడుదల చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'వైకాపా ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోంది'
వైకాపా ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోందని.. దళిత సంఘాల నేత మానుకొండ శివప్రసాద్ అన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు వారిపైనే దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
దళిత నేతల ఆందోళన
దళితులపై దాడులను అరికట్టాలని.. వారికి కేటాయించిన భూములను వారికే ఇవ్వాలన్నారు. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని... అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
ఇవీి చదవండి... 'మేం చల్లుతున్నది మైదా కాదు.. బ్లీచింగ్ పౌడరే'