ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 16, 2019, 7:56 PM IST

ETV Bharat / state

కోడెల కొడుకు కెన్యాలో ఉంటే... అసత్యాలు ప్రచారమా..!

కోడెల మరణానికి ప్రభుత్వమే కారణమని తెదేపా నేతలు ఆరోపించారు. రాజకీయ దురుద్ధేశంతో కోడెల కుటుంబంపై కేసులు పెట్టారన్నారు. కోడెలను ఆత్మహత్యకు ప్రేరేపించిన ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోడెల కుమారుడు కెన్యాలో ఉంటే ఆయనపై వైకాపా తప్పుడు ప్రచారాలు చేస్తోందని తెదేపా నేతలు విమర్శించారు.

కోడెల కొడుకు కెన్యాలో ఉంటే... అసత్యాలు ప్రచారాలా..!

కోడెల కొడుకు కెన్యాలో ఉంటే... అసత్యాలు ప్రచారాలా..!
మంత్రి బొత్స సత్యనారాయణ... కోడెల మృతిపై చేసిన వ్యాఖ్యలను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. కోడెలను ప్రభుత్వమే రాజకీయంగా క్షోభకు గురి చేసి.. ఆత్మహత్య చేసుకునేలా చేసిందని ఆరోపించారు. వైకాపా నేతలు కోడెల కుమారుడు శివరామకృష్ణపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కోడెల శివరామ్ కెన్యా పర్యటనలో ఉన్నారని.. ఆయన వీసా స్టాంపు ఆధారాలను తెదేపా నేతలు బయటపెట్టారు. రాజకీయ దురుద్ధేశంతోనే కోడెల కుటుంబంపై కేసులు పెట్టినట్లు ఆరోపించారు. కోడెలను ఆత్మహత్యకు ప్రేరేపించిన ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4 వేలు కూడా ఖరీదు చేయని సామగ్రిపై అనవసర రాద్ధాంతం చేసి.. కోడెలను అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. ప్రభుత్వ దుర్మార్గంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెదేపా కోరింది. హత్యానేరం కింద కేసులు పెట్టాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారణాలు అన్వేషించటం మాని, కొందరు మంత్రులు అసత్య ప్రచారం చేస్తోన్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details