ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP PROTEST: చంద్రబాబుపై రాళ్ల దాడిని ఖండిస్తూ తెదేపా నిరసన - ఏపీ తాజా వార్తలు

TDP PROTEST: చంద్రబాబుపై రాళ్ల దాడిని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. దాడిని చేయటాన్ని ఖండిస్తూ పలు ప్రాంతాల్లో నల్లజెండాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చంద్రబాబుకు, పవన్‌కల్యాణ్‌కు భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు.

TDP
చంద్రబాబుపై రాళ్ల దాడి ఖండించిన తెదేపా

By

Published : Nov 5, 2022, 5:33 PM IST

చంద్రబాబుపై రాళ్ల దాడి ఖండించిన తెదేపా

TDP PROTEST: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై నందిగామ వద్ద రాళ్ల దాడి చర్యను తిరుపతి తెదేపా నాయకులు ఖండించారు. నందిగామ వద్ద జరిగిన దాడి నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడటంతో అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి ఆశీస్సులు చంద్రబాబుకు ఉండాలని వేడుకున్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. తెదేపా హయాంలో జగన్‍ పాదయాత్రకు ఇబ్బంది లేకుండా చూశామని.. అలాంటిది చంద్రబాబు పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం కనిపించిందన్నారు.

తెదేపా అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి చేయటాన్ని నిరసిస్తూ గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో నల్లజెండాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వినతిపత్రం అందజేశారు. పూలల్లో రాళ్లు పెట్టి విసిరి హత్యాయత్నం చేశారని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణ ఆరోపించారు. దాడి నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడటంతో.... అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబుకు, పవన్‌కల్యాణ్‌కు భద్రత పెంచాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details