గుంటూరు జిల్లా బాపట్ల మండలం మర్రుప్రోలు వారి పాలెంలో.. బలహీన వర్గానికి చెందిన యువతిపై కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. నిలదీసిన బాధితురాలి సోదరుడిపై దాడికి పాల్పడారు. తెదేపా నేతలు మర్రుప్రోలు వారి పాలెం సందర్శించారు.
బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో బలహీనవర్గాలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.