ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు నాటక రంగం పెద్దదిక్కు కోల్పోయింది: చంద్రబాబు - amaravathi news

సినీనటుడు జయప్రకాశ్ రెడ్డి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటుని పేర్కొన్నారు.

TDP chief Chandrababu has expressed shock over the death of actor Jayaprakash Reddy
సినీనటుడు జయప్రకాశ్ రెడ్డి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

By

Published : Sep 8, 2020, 9:23 AM IST

Updated : Sep 8, 2020, 9:40 AM IST

జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం తెలియజేశారు. జయప్రకాశ్ రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ జయప్రకాశ్ రెడ్డి అని కొనియాడారు. నాటక, చలన చిత్రరంగానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. తెలుగు నాటకరంగం పెద్దదిక్కును కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

జయప్రకాశ్‌ రెడ్డి మృతి పట్ల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సంతాపం తెలిపారు. విభిన్న పాత్రలతో ప్రేక్షుకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:సీనియర్​ నటుడు జయప్రకాశ్​ రెడ్డి ఇకలేరు..

Last Updated : Sep 8, 2020, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details