ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా అధినేత ప్రశంస పత్రం అందజేత.. - tdp news

తాడేపల్లి మండలం గుండిమెడ, చిర్రావూరు గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా అధినేత పంపిన నిత్యావసర సరుకులు, ప్రశంసా పత్రాన్ని పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్​చౌదరి పంపిణీ చేశారు. కార్మికులను తెదేపా నాయకులు సత్కరించి.. అభినందించారు.

appreciation to sanitation workers
తెదేపా అధినేత ప్రశంస పత్రం

By

Published : Jun 9, 2021, 6:38 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిన నిత్యావసర సరుకులు, ప్రశంసా పత్రాన్ని తెదేపా నేతలు అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ, చిర్రావూరు గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు తాడేపల్లి మండలం తెదేపా అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్ చౌదరి పంపిణీ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న కార్మికులను ఆయన అభినందించారు.

'మీరే మా రియల్ హీరో మీకు మా సెల్యూట్' అసలు మీరు చేస్తున్న సేవకు కృతజ్ఞతలు అంటూ చంద్రబాబు ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. మా కోసం మీరు చేస్తున్న త్యాగాలను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామని.. ఆ దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా జీవించే రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ప్రశంస పత్రంలో వెల్లడించారు. అనంతరం కార్మికులను తెదేపా నాయకులు సత్కరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details