తెలుగువారందరికీ భాషా దినోత్సవ శుభాకాంక్షలు : చంద్రబాబు - తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు
తెలుగువారందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు ట్వీట్టర్ వేదికగా తెలిపారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్. తెలుగు భాషా వికాసానికి గిడుగు రామ్మూర్తి ఎంతగానో కృషిచేశారని చంద్రబాబు అభివర్ణించారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఘనత తెదేపాదేనని అన్నారు. అమ్మను ప్రేమించి, గౌరవించినట్టే తెలుగునూ అభిమానిద్దామని పిలుపునిచ్చారు నారా లోకేష్.
తెలుగు ప్రజలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు,జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు భాషా వికాసానికి ఎంతగానో కృషిచేసిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.తెలుగు వారి కోసం భాష ప్రాతిపదిక మీద తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఘనత తెలుగుదేశానిదేనన్నారు.ఎందరో తెలుగు భాషాభిమానుల కృషి,పోరాటాల ఫలితంగా కంప్యూటర్‌లోనూ తెలుగు భాష ఉపయోగిస్తున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అభిప్రాయపడ్డారు.తెలుగంటే అమ్మభాష అని....,అమ్మను ప్రేమించి,గౌరవించినట్టే తెలుగునూ అభిమానిద్దామని పిలుపునిచ్చారు.తెలుగు భాషాభివృద్ధికి కృషి చేద్దామన్నారు.