పార్టీ కార్యక్రమాలను ఇకపై అమరావతి వేదికగా నిర్వహించేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కనే నిర్మించిన.... పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2.20లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టిన నూతన భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నా...తొలుత కార్యక్రమాల నిర్వహణకు ఒక బ్లాక్ ను సిద్ధం చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ భవన్ పేరిట నిర్మించిన ఈ భవనంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దంపతులు గత రాత్రి పూజలు నిర్వహించారు. శృంగేరీ శారదాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వర్యంలో కార్యాలయం ఆవరణలో ముందుగా గణపతి పూజ చేశారు. అనంతరం సుదర్శన హోమం, గణపతి హోమం నిర్వహించారు. వేదపండితుల సమక్షంలో..... పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేశారు. ఉదయం 10గంటల 3నిమిషాలకు చంద్రబాబు కార్యాలయాన్ని ప్రారంభిచనున్నారు.
నేడు తెదేపా కేంద్ర కార్యాలయం ప్రారంభం - నేడు తెదేపా కేంద్ర కార్యాలయం ప్రారంభం
తెదేపా నూతన కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారి పక్కన నిర్మించిన ఈ కార్యాలయం నుంచే ఇకపై పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నేడు తెదేపా కేంద్ర కార్యాలయం ప్రారంభం