ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపాకు ఓటేసినందుకు... ఊరు విడిచి బతుకున్నాం'

తెదేపాకు ఓట్లేసినందుకు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిన్నెల్లి గ్రామస్థులు అంటున్నారు. వైకాపా దాడుల నుంచి తప్పించుకునేందుకు 150 కుటుంబాలు ఊరి వదిలి వెళ్లిపోయాయని... 50 మందిపై దాడులు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైతం తమకు సాయం చేయకుండా ఊరు విడిచి వెళ్లండని సలహా ఇస్తున్నారని వాపోతున్నారు.

By

Published : Jun 15, 2019, 4:52 PM IST

Updated : Jun 15, 2019, 6:07 PM IST

బాధితులు

'తెదేపాకు ఓటేసినందుకు... ఊరు విడిచి బతుకున్నాం'

గుంటూరు జిల్లాలో తెదేపా శ్రేణులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తమని వైకాపా నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్థులు గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మికి ఫిర్యాదు చేసేందుకు ఇవాళ ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఆమె అందుబాటులో లేనందున అధికారులకు విషయం విన్నవించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి తమ గ్రామంలో ఆందోళనకర వాతావరణం నెలకొందని పిన్నెల్లి గ్రామస్థులు చెబుతున్నారు. తెదేపాకి ఓటు వేసిన వారిపై వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. విషయం పోలీసులకు చెబితే కొద్ది రోజుల పాటు గ్రామం వదిలిపోవాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్నా తమకు రక్షణ లేదని వాపోతున్నారు. ఇప్పటివరకు పిన్నెల్లి గ్రామంలో ఎన్టీఆర్ తాగునీటి పథకం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని... అడ్డుకోవడానికి పోతే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా వర్గీయుల పొలాలను ఎవరూ కౌలుకు తీసుకోకూడదని గ్రామంలో దండోరా వేయించారని వారు చెబుతున్నారు. రాజకీయ దాడులపై కఠినంగా ఉంటామని స్వయంగా హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగటంపై తెదేపా శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Last Updated : Jun 15, 2019, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details