'100 రోజుల జగన్ తుగ్లక్ పాలన' - tdp book release on ysrcp
వంద రోజుల్లో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై పుస్తకాన్ని విడుదల చేసింది తెదేపా. 100 రోజుల్లో ప్రభుత్వం 125 తప్పులు చేసిందని బ్రోచర్‌లో పేర్కొంది. తుగ్లక్ పరిపాలన అని ప్రజల్లో ముద్రపడిపోయిందని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కుంటుపడిపోతున్నాయని కళా వెంకట్రావ్ దుయ్యబట్టారు.
వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై '100 రోజుల జగన్ తుగ్లక్ పాలన' పేరిట తెలుగుదేశం పార్టీ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. 100రోజుల పాలనలో ప్రజా వేదిక కూల్చివేత మొదలు రాజధాని పనులు నిలిపివేయడం, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవటం, తెదేపా నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు, తెలుగుదేశం హయాంలో అమలు చేసిన వివిధ పథకాల రద్దు తదితర అంశాలన్నింటినీ ఆ పుస్తకంలో పేర్కొన్నట్లు తెదేపా నేతలు తెలిపారు. పార్టీ సీనియర్ నేతలు కళా వెంకట్రావ్, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఇప్పుడు విడుదల చేసింది మొదటి ఛార్జిషీట్ మాత్రమేనన్న యనమల రామకృష్ణుడు....త్వరలోనే మరొకటి విడుదల చేస్తామని తెలిపారు.