వైకాపా నేతలు కక్షసాధింపు చర్యలలో భాగంగా ఓ కులాన్ని రెచ్చగొట్టి వారితో తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన చేయించారని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. చంద్రబాబు వాడుక భాషలో పొరపాటున అన్న వాఖ్యాన్ని ఉద్దేశపూర్వకంగా వైకాపా నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ కులానికి చెందిన కార్పొరేషన్ డైరెక్టర్ ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొస్తే మరుసటి రోజే వివరణ ఇచ్చారని తెలిపారు.
'వైకాపా నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి' - చంద్రబాబు బుట్టరాజులు కామెంట్స్
తెదేపా అధినేత చంద్రబాబు పొరపాటున ఓ పదాన్ని సంబోధించారే కానీ వేరే కులాన్ని కించపరచాలనే ఉద్దేశం లేదని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. ఈ విషయంపై చంద్రబాబు పత్రిక ముఖంగా వివరణ ఇచ్చారన్నారు. కానీ వైకాపా నేతలు రెచ్చగొట్టి చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేయించారని ఆరోపించారు. వైకాపా నేతలు ఇటువంటి చర్యలు మానుకోవాలని చంద్రశేఖర్ హితవు పలికారు.
Tdp bc cell
అయినా కొంతమంది దుష్టశక్తులతో కలసి నిరసనలు తెలపడటం బాధాకరమన్నారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని వైకాపా నేతలకు హితవుపలికారు.
ఇదీ చదవండి :విలేకర్లను అనుమతించకపోతే నేనూ వెళ్లిపోతా: వైకాపా ఎమ్మెల్యే
Last Updated : Dec 7, 2020, 4:18 PM IST