అసెంబ్లీలో ఎన్సార్సీకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందనే వార్తలపై గుంటూరు జిల్లాకు చెందిన ముస్లీం మైనార్టీ సంఘాలు స్పందించాయి.అయితే వైకాపాకు చెందిన ముస్లీంలు బిల్లు ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ...ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్లో సమర్ధించి.... అసెంబ్లీలో తీర్మానామా!
అసెంబ్లీలో ఎన్సార్సీకు వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెట్టిందనే వార్తలపై వైకాపాకు చెందిన మైనార్టీలు, తెదేపాకు చెందిన మైనార్టీలు విభిన్నంగా స్పందించాయి.
tdp and ycp muslim leaders respond on nrc bill mentioned in assembly
తెదేపాకు చెందిన నసీర్ అహ్మద్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టమంటూ వైకాపా ప్రభుత్వం మరోసారి ముస్లిం మైనార్టీలను మభ్యపెడుతుందని ఆరోపించారు. పార్లమెంటులో మద్దతు తెలిపిన వైకాపా... ముస్లీంలను ప్రక్కదారి పట్టించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిందనన్నారు. వైకాపా వ్యవహరిస్తున్న తీరుపై మైనార్టీలు అంతా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లిం మైనార్టీలకు తెదేపా ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు.
ఇదీ చూడండి