ఆస్తి పన్ను పెంపు, చెత్తపై పన్నులను నిరసిస్తూ గుంటూరులో తెదేపా, జనసేన వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆయా పార్టీల నేతలు వేర్వేరుగా నగరపాలక సంస్థ ముట్టడికి యత్నించారు. వారిని కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులు మధ్య తోపులాట జరిగింది. ఆస్తి పన్ను స్వల్పంగానే పెరుగుతుందని మున్సిపల్ ఎన్నికల ముందు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు భారీగా భారం మోపుతోందని నేతలు విమర్శించారు.
గుంటూరులో తెదేపా, వామపక్షాల ఆందోళన.. - guntur updates
ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ గుంటూరులో తెదేపా, వామపక్షాల ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో నగరపాలక సంస్థ ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
చెత్తపై ఏడాదికి 14 వందల రూపాయలు పన్ను విధించటాన్ని వామపక్ష నేతలు తప్పు పట్టారు. సంక్షేమ ప్రభుత్వమని మాటలు చెప్పటం తప్పా.. వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేం లేదని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని తెదేపా నేత బుచ్చిబాబు విమర్శించారు. బలం ఉందని చెప్పి ప్రజల నడ్డి విరిగేలా పన్నులు వేయటం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండీ..ఏపీఎస్‌డీసీ నిబంధనలు కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి: కేంద్రం