ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మహత్య చేసుకున్న మేస్త్రీ కుటుంబానికి రూ.5 లక్షలు, ఓ ఉద్యోగం - tdp and janasena candidates protest at tenali hospital

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఎదుట తెదేపా, జనసేన నాయకులు ఆందోళన చేశారు. శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న తాపీ మేస్త్రీ బ్రహ్మాజీ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

తెనాలి ఆసుపత్రి ఎదుట తెదేపా, జనసేన నాయకుల ఆందోళన

By

Published : Oct 26, 2019, 8:47 PM IST

Updated : Oct 26, 2019, 11:57 PM IST

ఆత్మహత్య చేసుకున్న మేస్త్రీ కుటుంబానికి రూ.5 లక్షలు, ఓ ఉద్యోగం

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఎదుట తెదేపా, జనసేన, భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. సంగం జాగర్లమూడిలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న తాపీ మేస్త్రీ బ్రహ్మాజీ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బ్రహ్మాజీ ఇసుక కొరతతో ఉపాధి లేక బలవన్మరణానికి పాల్పడగా... కుటుంబ కలహాలతో చనిపోయినట్లు కేసు నమోదు చేశారని తెలిపారు. నేతల ఆందోళనతో... దిగొచ్చిన పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. అనంతరం మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే శివకుమార్​ ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు, ఒక ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో నేతలు ఆందోళన విరమించారు.

Last Updated : Oct 26, 2019, 11:57 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details